ఇల్లూ బేబీకి అంత సీన్ ఉందంటారా?


ఇల్లూ బేబీకి అంత సీన్ ఉందంటారా?
ఇల్లూ బేబీకి అంత సీన్ ఉందంటారా?

తెలుగులో సినిమాలు చేస్తున్నంత కాలం తన పనేదో తనది అన్నట్లుండే ఇలియానా, బాలీవుడ్ కి వెళ్ళాక మాత్రం బాగా రాటుదేలింది. వరసగా సంచలన కామెంట్స్ చేయడం, అనవసర వివాదాల్లోకి దూరడం, హాట్ ఫోటోషూట్లు ఇలా ఇలియానా నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ తో ప్రేమాయణం, చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు పెట్టడం, ఆ తర్వాత బ్రేకప్.. ఇలా సినిమాలు చేయకపోయినా ఇలియానాకు క్రేజ్ మాత్రం తగ్గకుండా చూసుకుంది. ప్రేమలో ఉన్నప్పుడు సినిమాలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన ఇలియానా, ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలనుకుంటోంది. మళ్ళీ సౌత్ సినిమాలపై కన్నేసింది. అప్పట్లో సౌత్ సినిమాలపై దిగజారుడు కామెంట్లు చేసినా తన అవసరం వచ్చేసరికి మళ్ళీ పొగడ్తలు మొదలుపెట్టింది. ఇవన్నీ కాకుండా ఇందాక చెప్పుకున్నట్టు ఇలియానా చాలా ఓపెన్ గా మాట్లాడేస్తూ ఉంటుంది. ఇంటికి రాగానే బ్రా విప్పి ఒక మూలకు గిరాటేస్తే వచ్చే ఆనందం ముందు ఏదీ సరిపోదు అని చేసిన కామెంట్ అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.

రీసెంట్ గా ఇలియానా మరో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన వాంటెడ్, కిక్ సినిమాలకు మొదట ఇలియానానే హీరోయిన్ గా సంప్రదించారట. కానీ తాను ఆ సమయంలో చాలా బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయానని చెప్పుకొచ్చింది. ఈ స్టేట్మెంట్ నిజంగానే అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బాలీవుడ్ లో ఆఫర్ కోసం ఇలియానా తాపత్రయపడినంతగా ఎవరూ పడి ఉండరు. పైగా సల్మాన్ ఖాన్ తో సినిమా అంటే ఎవరు కాదనుకుంటారు? పోనీ ఇలియానా నిజంగానే బిజీగా ఉందా అనేది చూద్దాం.

వాంటెడ్ సినిమా అప్పుడు ఇలియానా సౌత్ లో బిజీ స్టార్. మరీ తీరికలేనంత బిజీ కాదు కానీ వరస సినిమాలు అయితే లైన్లో ఉన్నాయి. అయితే టాలీవుడ్ లో ఆ సమయంలో యువ హీరోలతో కూడా నటించిన ఇలియానా, సల్మాన్ కు మాత్రం ఎందుకు తీరిక చేసుకోలేకపోయింది అన్నది అర్ధం కావడం లేదు. ఇదిలా ఉంటే కిక్ మూవీ టైమ్ లో ఇలియానా టాలీవుడ్ లో ఫేడవుట్ స్టేజ్ లో ఉంది. ఆ సమయంలో అవకాశం రావడమే ఎక్కువ. మరి అప్పుడు కూడా డేట్ల సమస్య అని ఎందుకు చెప్పిందో. వాంటెడ్, కిక్ ఈ రెండు చిత్రాల మాతృకలో ఇలియానానే హీరోయిన్, కాబట్టి నిజంగానే సంప్రదించారు అనుకోవచ్చు. మరి బాలీవుడ్ వైపు ఎప్పుడూ ఆసక్తిగానే ఉండే ఇలియానా ఎందుకు నో అన్నట్టు? లేక కేవలం పబ్లిసిటీ కోసం ఇలా చెబుతోందా?