సన్నజాజి ముద్దుగుమ్మ కోరిక తీర్చేవారే లేరు దానికోసం ఆమె నిరీక్షణ


సన్నజాజి ముద్దుగుమ్మ కోరిక తీర్చేవారే లేరు దానికోసం ఆమె నిరీక్షణ
సన్నజాజి ముద్దుగుమ్మ కోరిక తీర్చేవారే లేరు దానికోసం ఆమె నిరీక్షణ

2006 ‘దేవదాసు‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది గోవా బ్యూటీ ‘ఇలియానా డి క్రూజ్’. వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ ‘రామ్’ సరసన నటించిన ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అప్పటివరకు జీరో సైజు ఫిగర్ తో ఉండే కథానాయకులలో ఇలియానా గారు ముందు వరుసలో ఉండేవారు.

తెలుగులో వరుసగా పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూ.ఎన్.టి.ఆర్, ప్రభాస్, రానా వంటి పెద్ద హీరోల సరసన నటించిన కారణంగా మొదటి హీరోయిన్ గా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే వారి జాబితాలో చేరిపోయింది. అప్పటికి రేసులో త్రిష, ఛార్మి, నయనతార, జెనీలియా, శ్రియా సరన్ లాంటి ముద్దుగుమ్మలు ఉన్నప్పటికీ వారు అందుకులేని పారితోషకం వారికంటే ముందు వరుసలో ఉండేది  ఇలియానా. అందుకే వారికంటే ముందే బాలీవుడ్ లో ఆఫర్లు రాగానే ముంబై కి మకాం మార్చేసింది.

కొన్ని ఇంటర్వ్యూ లో తెలుగు సినిమాల మీద ఆవేదన వ్యక్తం చేసి దర్శకుల, హీరోల మీద నోరు జారుతూ మాటలు కూడా అనేసింది. బాలీవుడ్ కి వెళ్ళిపోగానే ఈమెకి తల పొగరు ఎక్కిందని దూరం పెట్టేసారు. తెలుగు నుండి ఆఫర్లు కూడా తగ్గించేశారు. 2012 లో వచ్చిన జులాయి, దేవుడు చేసిన మనుషులు సినిమాల తర్వాత మళ్ళీ తెలుగులో కనిపియ్యలేదు. బాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీ జీవితాన్ని గడిపేసింది. గత సంవత్సరం తెలుగు సినిమా నుండి ఒక ఆఫర్ వచ్చింది. అది మాస్ మహారాజ ‘రవితేజ’ హీరోగా ‘శ్రీను వైట్ల’ దర్శకత్వంలో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా. ఆ సినిమా ఫలితం ఫ్లాప్ దిశగా పోయి ఇలియానాకి దురదృష్టాన్ని తెచ్చిపెట్టింది.

ఆ సినిమాలో లావుగా కనిపించి తనకి ఉన్న కొద్దో గొప్పో అభిమానులని కూడా పోగొట్టుకుంది. పూర్తిగా లావుగా మారిన సన్నజాజి ముద్దుగుమ్మని తెలుగు ప్రజలు తెర మీద చూడలేక జీర్ణించుకోలేకపోయారు. అయితే ఆమెని ఇంటర్వ్యూ లో ఒక ప్రశ్నగా మీ కోరిక ఏంటనే అడిగితే…”నాకు ఎవరన్న పుష్పగుచ్చాలు ఇస్తారని ఎదురుచూసేదాన్ని అని…ఆఖరికి నాకు దగ్గరైన నా బాయ్ ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు నాకు ఇవ్వలేదని..మా నాన్న గారు తప్ప నాకు పుష్పగుచ్చాలు ఇచ్చే ధైర్యం ఎవరు చేయలేదని” ఇంటర్వ్యూ లో చెప్పింది.

ఇంకొక మాట కూడా చెబుతూ నాకు నటన అంటే ఇష్టం లేదని..మంచి గాయకురాలిగా ఎదగాలి అనుకోని సినిమా పరిశ్రమకి వచ్చాను అలా అనుకోకుండా కథానాయికగా అవకాశాలు వచ్చాయి. ఇప్పటికీ సంగీత దర్శకులు ఎవరైన నాకు గాయకురాలిగా అవకాశం ఇవ్వకపోతారా? అని ఎదురుచూస్తున్నాను. నాకు బాలీవుడ్ లో నర్గీస్ ఫక్రీ, అర్షద్ వార్సీ వరుణ్ ధావన్ తో మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపింది.