`వ‌కీల్ సాబ్` కోసం `జ‌ల్సా` భామ‌?

`వ‌కీల్ సాబ్` కోసం `జ‌ల్సా` భామ‌?
`వ‌కీల్ సాబ్` కోసం `జ‌ల్సా` భామ‌?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్రీయాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాక సినిమాల్లో న‌టించ‌డం త‌గ్గించారు. దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం `వకీల్‌సాబ్‌`. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన `..మ‌గు వా మ‌గువా.. ` లిరిక‌ల్ వీడియో, ప‌వ‌ర్‌స్టార్ ఫ‌స్ట్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హిందీ, త‌మిళ రీమేక్‌ల‌కు భిన్నంగా ప‌వ‌న్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేసి తెర‌కెక్కిస్తున్నారు. కీల‌క ఘ‌ట్టాల  చిత్రీక‌ర‌ణ కొంత వ‌ర‌కు పూర్త‌యిన ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా ఎవ‌రు క‌నిపించ‌బోతున్నార‌ని ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

శృతిహాస‌న్ న‌టిస్తుంద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాను ఈ చిత్రంలో న‌టించ‌డం లేద‌ని శృతిహాస‌న్ ప్ర‌క‌టించ‌డంతో తాజాగా ఇలియానా పేరు వినిపిస్తోంది. ఇంత‌కు ముందే ఇలియానా న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ కార్య‌రూపం దాల్చ లేదు. తాజాగా మ‌రోసారి ఇలియానా పేరు తెర‌పైకి వ‌చ్చింది. నిర్మాత దిల్ రాజు ఇటీవ‌లే ఇలియానాని సంప్ర‌దించ‌న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్‌తో క‌లిసి ఇలియానా `జ‌ల్సా` చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే.