నేను ఇప్పుడు బాగున్నాను నన్ను చుడండి….


Ileana D'Cruz
నేను ఇప్పుడు బాగున్నాను నన్ను చుడండి….

గోవా బ్యూటీ “ఇలియానా” ఇప్పుడు సన్నగా అయ్యింది. నిజమే మీరే చుడండి అంటూ మాధ్యమాల్లో పోస్ట్ పెడుతూనే ఉంది గత వారం రోజులుగా. మరి లావుగా ఎందుకు అవ్వడం, వెంటనే స్లిమ్ గా అవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా?

తెలుగులో 2012 లో “జులాయి”, “దేవుడు చేసిన మనుషులు” సినిమాల తర్వాతా పూర్తిగా బాలీవుడ్ కి పోయిన మన ఇలియానా అక్కడ తన సత్తా చాటుకుంది. బర్ఫీ, రుస్తుం, రైడ్ వంటి బాలీవుడ్ సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చి పెట్టాయి.

ఇక గత సంవత్సరం తెలుగులో “అమర్ అక్బర్ ఆంథోనీ” సినిమా ద్వారా మళ్ళి తెలుగులో రి-ఎంట్రీ ఇచ్చింది, కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆడియో విడుదల కి కూడా హాజరు అయ్యింది, అప్పుడే మన తెలుగు ప్రేక్షకులు ఆమె లావుతనం చూసి కంగారు పడ్డారు. ఇలియానా ఏంటి ఇంత లావు అయ్యింది అని.. తీరా సినిమాలో అయినా బాగుంది కదా అనే వెళ్తే సినిమాలో కూడా ఆమె అలానే ఉండటంతో కనీసం ఇలియానాని చూసేవాళ్ళు కూడా ఇష్టపడలేకపోయారు.

చాలామంది ఇలియానా మీద… మీరు అల లావుగా ఉంటే మేము చూడలేకపోతున్నాం అని అభిమానులు ట్వీట్లు , మెస్సేజెస్ చేశారు.అల ఒక్కసారిగా వాళ్ళ అందరికోరికతో మళ్ళి సన్నగా అయ్యి తన స్లిమ్ బ్యూటీ ని మాధ్యమాల్లో పోస్ట్స్ చేసింది. గంట వ్యవధిలోనే ఆ పోస్ట్స్ వైరల్ అయ్యాయి. అభిమానులు అందరూ సంతోషంగా ఉన్నారు.

మరి ఇదంతా సినిమా కోసమా, లేక తన ఇష్టానుసారం ఇలా చేస్తుందా అన్నదానికి కారణం లేదు, వాటికి సమాధానం ఇలియానా ని అడిగి తెలుసుకోవాలి, మీరు కూడా ఒకసారి ఫొటోస్, వీడియోస్ చుడండి మీకే తెలుస్తుంది.

 

View this post on Instagram

 

Mood when I’m told I can have carbs today ?? @chandiniw @stacey.cardoz ?

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

 

View this post on Instagram

 

Fell flat on my face right before this shot. No seriously. – – – ? @rohanshrestha ?

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

Credit: Instagram