ప్ర‌స్తుతం సింగిలేనా అంటే మండిప‌డుతోంది!


ప్ర‌స్తుతం సింగిలేనా అంటే మండిప‌డుతోంది!
ప్ర‌స్తుతం సింగిలేనా అంటే మండిప‌డుతోంది!

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్‌లో స్టార్ స్టేట‌స్‌ని అనుభ‌వించిన విష‌యం తెలిసిందే. తెలుగులో టాప్ స్టార్‌ల‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఇలియానా తెలుగులో అత్య‌ధిక పారితోషికం అందుకుంది హీరోయిన్‌గానూ రికార్డు సాధించింది.  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `శ‌క్తి` చిత్రం త‌రువాత `బ‌ర్ఫీ` సినిమాతో బాలీవుడ్ బాట ‌ప‌ట్టిన ఇలియానా అక్క‌డ సెలెక్టీవ్‌గానే సినిమాలు చేస్తోంది.

ఆస్ట్రేలియ‌న్ ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నిబోన్‌తో డేటింగ్ చేసి వార్త‌ల్లో నిలిచిన ఇలియానా ఆ త‌రువాత కొంత కాలానికే అత‌నికి బ్రేక‌ప్ చెప్పేసి విడిపోయింది. ఆ త‌రువాత నుంచి సినిమాల‌పై దృష్టిపెట్టిన ఇలియానా ఓ బాలీ‌వుడ్ హీరోతో స‌న్నిహితంగా వుంటోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌ని ఇలియానా కండించ‌డం లేదు. ఇదిలా వుంటే ఇన్ స్టా వేదిక‌గా ఇలియానా ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

ఇన్ స్టా వేదిక‌గా ఓ అభిమాని ప్ర‌స్తుతం మీరు సింగిల్‌గా వున్నారా?  లేక మ‌రొక‌రి కోసం ఏమైనా వెతుకుతున్నారా? అని ప్ర‌శ్నిస్తే అత‌నిపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది.  మ‌రోసారి అలాంటి ప్ర‌శ్న త‌న‌ని వేయొద్ద‌ని వార్నింగ్ ఇచ్చినంత ప‌ని చేసింది.