అభిమానికి షాకిచ్చిన గోవా బ్యూటీ!

అభిమానికి షాకిచ్చిన గోవా బ్యూటీ!
అభిమానికి షాకిచ్చిన గోవా బ్యూటీ!

హీరోయిన్‌ల స‌ర‌దా సంభాష‌ణ ఒక్కో సారి అభిమానుల‌కు షాకిస్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా స్టార్స్ ఈ మ‌ధ్య అభిమానుల‌తో నేరుగా మాట్లాడుతున్నారు. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఠ‌క్కుమ‌ని అక్క‌డే స‌మాధానాలు చెప్పేస్తున్నారు. కొన్ని సార్లు వారు చెప్పే స‌మాధానాలు అభిమానుల‌కు ఆనందాన్ని క‌లిగిస్తుంటే కొన్ని సార్లు ఊహించిని విధింగా షాకిస్తున్నాయి.

ఇలాంటి ప‌నే గోవా బ్యూటీ ఇలియానా చేసి అభిమానుల‌కు షాకిచ్చింది. టాలీవుడ్‌కు బైబై చెప్పేసి బాలీవుడ్ బాట ప‌ట్టిన ఇలియానా త‌న వ‌రు వ‌చ్చిన చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తూ సంద‌డి చేస్తోంది. సినిమాల్లో రెగ్యుల‌ర్‌గా క‌నిపించ‌క‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం నిత్యం అభిమానుల‌కు అందుబాటులోనే వుంటోంది. తాజాగా ఇలియానా అబిమానులతో ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ముచ్చ‌టించింది.

`అస్క్ మీ ఎనీథింగ్‌` పేరుతో నిర్వ‌హించిన ఈ చాటింగ్‌లో ఇలియానా అభిమానులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పింది. ఈ నేప‌థ్యంలో ఓ అభిమాని `మీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి?` అని అడిగితే త‌ను పెంచుకుంటున్న కుక్క‌ని చూపించి `వీడి పేరు చార్లీ` అంటూ సామాధానం ఇచ్చింది. దీంతో ఇలియానా నుంచి ఊహించ‌ని స‌మాధానం రావ‌డంతో స‌ద‌రు అభిమాని షాక‌య్యాడ‌ట‌.