“మా” సంస్థ కి నేనే ముందుంటా – నేను వెనకపడలేను !


MAA
“మా” సంస్థ కి నేనే ముందుంటా – నేను వెనకపడలేను

“మా” (సినిమా ఆర్టిస్ట్ ల) సంస్థ అంటే అబ్బో చాల ఉందిలే అని ఎవరైన ఇట్టే చెప్పేస్తారు, అది ఒక సినిమా సంఘం అని కాకుండా, అటు రాజకీయం, ఇటు పగలు, ప్రాతికారాలు అంటూ ఈ సంవత్సరంలొ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు, ముందుగా చెప్పినట్టు చాల వుంది, అది మనం ఎన్నిసార్లు చెప్పుకున్న తరగని చెరగని మచ్చ.

నరేష్ సంఘం తరపున గెలిచిన వాళ్ళల్లో, వాళ్ల్లకే ఒకరంటే ఒకరు పడట్లేదు అని విన్నాం, అవి ఇలా పబ్లిక్ లోకి వచ్చిందో లేదో వెంటనే అది ఏం లేదు అవన్నీ నమ్మకండి అవి పుకార్లు మాత్రమే అన్నారు, ఎంత పుకార్లు అయిన ఎవరోఒకరు వాటికీ సమాధానం చెప్తేనే వాటికి మూత పడతాయి అప్పటి వరకి అవి అల వెళ్తూనే వుంటాయి.

ఇక అసలు విషయానికి వొస్తే మా సంఘం వాళ్లు అడపాదడప కొన్ని కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు అందులో వృద్దులకు చేయూత, ఇంకా ఇంకా అల ఏవైతే సమాజానికి అవసరం అయిన వాటిని చేస్కుంటూ వచ్చారు, కాని ఇప్పుడు మా సంఘం దగ్గర డబ్బులు ఇతరుల దగ్గర చేయి చాపి అడగవలసిన పరిస్థితి అని ఫిలింనగర్ లో బాగా వినిపిస్తున్న హాట్ టాపిక్, ఇంకా హాట్ టాపిక్ ఆ మాట ఈ మాట పాకుతూ చివరికి “యాంగ్రి యంగ్ మాన్ రాజశేఖర్” గారి దగ్గరికి వెళ్ళడంతో, మీరు అల చేయకండి ఏమన్న వుంటే మన సంఘం వాళ్ళు మాత్రమే చేయాల్సిన భాద్యతలు వేరే వారి దగ్గర డబ్బులు తీస్కొని మనం అల ఉండకుడదు అని గట్టిగ మందలించి తన వంతు సాయంగా 10 లక్షల విరాళం ఇచ్చినట్లుగా మాటలు వినిపిస్తున్నాయి.

నిజంగా రాజశేఖర్ గారు ఆలోచించిన విధానం, పద్థతి మంచిది అని పలువురు ప్రశంసించారు.