యంగ్ హీరో రాసలీలల టేప్ నిర్మాత చేతిలో


యంగ్ హీరో తరచుగా గోవా వెళుతూ పలువురు హీరోయిన్ లతో అలాగే మోడల్ లతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడట ! గోవా లో ఎంజాయ్ చేయడమే కాకుండా ఆ ఎంజాయ్ తాలూకు మొత్తాన్ని ఫోటోలు , అలాగే వీడియో లు తీసుకొని చూడటం అలవాటు అట పాపం ! అదే ఆ యంగ్ హీరో కొంప ముంచింది . పలువురు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసుకున్న వీడియో లు ఇప్పుడు ఓ నిర్మాత చేతికి చిక్కాయట !

దాంతో ఆ నిర్మాత ఆ వీడియో లు చూసి షాక్ అయ్యాడట ! ఏరా ! కుర్ర హీరో తెరమీద నీతులు చెప్పే నువ్వు ఇలా రెచ్చిపోవడమేంట్రా అంటూ ఆ వీడియోల తాలూకు ఫుటేజ్ నా దగ్గర ఉంది అంటూ ఆ హీరోకు సమాచారం ఇచ్చాడట దాంతో మొదట అలాంటి వీడియో లు ఏమి లేవు నన్ను బెదరించలేవు అని గట్టిగా మాట్లాడాడట ! కానీ ఆ నిర్మాత ఫలానా వాళ్లతో ఎంజాయ్ చేస్తున్న వీడియో లు నిజమే అని వివరాలతో చెప్పేసరికి బిక్కు బిక్కు మనడం ఆ హీరో వంతు అయ్యిందట. అయినా రాసలీలలు సాగిస్తే హాయిగా ఎంజాయ్ చేయాలి కానీ వీడియోలు తీయడం ఎందుకు వాటితో ఇబ్బంది పడటం ఎందుకు ?