సెమీ ఫైనల్లో భారత్ ఓటమి


india lost the match in semi final
India lost the match in semi final

ఈరోజు  జరిగిన సెమీ ఫైనల్ లో భారత్ ఓటమి పాలవ్వడంతో ఇంటి బాట పట్టింది . న్యూజిలాండ్ పై విజయం సాధించి ఫైనల్ కు చేరుతుంది ఇండియా అని కోట్లాది మంది భారతీయులు ఆశలు పెట్టుకోగా అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ సెమీస్ నుండే నిష్క్రమించారు కోహ్లీ సేన . వర్షం వల్ల నిన్న జరగాల్సిన మ్యాచ్ ఈరోజుకి వాయిదాపడగా బ్యాట్ తో సమాధానం చెప్పాల్సిన టీమ్ ఇండియా చేతులెత్తేసి బ్యాక్ టు పెవిలియన్ అంటూ క్యూ కట్టారు .

దాంతో భారత్ వరల్డ్ కప్ నుండి నిష్క్రమించింది . న్యూజిలాండ్ భారత్ పై అలవోక విజయం సాధించి ఫైనల్ కు చేరింది . విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ , విఫలం కావడంతో టీమ్ ఇండియా భారీ మూల్యం చెల్లించుకుంది . టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడంతో ధోని , జడేజా లపై భారం పడింది . వర్షం వల్ల గట్టెక్కడం ఖాయం , ఫైనల్ కు వెళ్లడం ఖాయం అని అనుకున్న వాళ్లకు దిమ్మతిరిగేలా చేసారు టీమ్ ఇండియా .