ఇండియన్ క్రికెటర్ సినిమాలో నటించబోతున్నారు అది కూడా పెద్ద హీరోతో…


ఇండియన్ క్రికెటర్ సినిమాలో నటించబోతున్నారు అది కూడా పెద్ద హీరోతో...
ఇండియన్ క్రికెటర్ సినిమాలో నటించబోతున్నారు అది కూడా పెద్ద హీరోతో…

తమిళ-తెలుగు సినిమాలలో వైవిద్యంగా నటించే హీరోల గురించి మాట్లాడుకుంటే ఎంతంది లిస్ట్ లో ఉన్నా కూడా మొదట పేరు ‘చియాన్ విక్రమ్‘ అని వినిపిస్తుంది. జనరల్ గా ఎవరన్నా హీరోలు వారి సినిమాలో ప్రయోగాలు చేస్తే సినిమా విడుదల అయ్యేదాకా ఆ సినిమా ఆడుతుందా? లేదా? అని కంగారు పడతారు. కానీ విక్రమ్ గారి సినిమాలే పెద్ద ప్రయోగాలు.

ఆ ప్రయోగాల వల్లనే అభిమానులని సొంతం చేసుకున్నారు. అపరిచితుడు సినిమా విక్రమ్ గారి కెరీర్ లో పెద్ద మైలురాయి. ఆ తర్వాత చాల సినిమాలు చేసుకుంటూ వచ్చారు కానీ తెలుగులో అంతగా పేరు రాలేదు. హిట్ కోసం దాదాపు 10 సంవత్సరాలు ఎదురు చూసిన హీరోలలో విక్రమ్ గారి పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రయోగాలు ఎక్కువగా చేసి విక్రమ్ గారి సినిమాలు ఫలితానికి సంబంధం లేకుండా వెళ్లిపోతాయి.

ఆ ప్రయోగాల బారినుండి ‘ఇంకొక్కడు’ సినిమా బయటపడేసింది. ఆ సినిమా తెలుగు, తమిళంలో మంచి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేసారు. అవి కూడా తిరిగి ఇంటికి పయనం అయ్యేవి. ఈ సంవత్సరం విడుదల అయ్యిన ‘మిస్టర్ కె కె’ సినిమా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. ఇక తర్వాత సినిమాగా ‘అజయ్ ఙ్ఞానముత్తు’ గారి దర్శకత్వంలో ఒక సినిమాని పట్టాలెక్కించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు అన్ని జరుపుకుంది. షూటింగ్ కూడా షెర వేగంగా జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాలో ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక మంచి పాత్ర చేయబోతున్నాడు అని గత కొంతకాలంగా వార్త చక్కర్లు కొడుతుంది. ఇక ఆ వార్తకి సమాధానంగా ఇర్ఫాన్ పఠాన్ తన ట్విట్టర్ లో ” అవును నేను విక్రమ్ గారి సినిమాలో నటించబోతున్నాను, నేను ఇప్పటి వరకు చాలా తమిళ సినిమాలు చూసాను, అవి హిందీలోకి కూడా డబ్బింగ్ అవుతుంటాయి. నేను విక్రమ్ గారికి పెద్ద అభిమానిని అయన నటించిన “అన్నియన్ (అపరిచితుడు)” సినిమా నాకు చాలా ఇష్టం. అలా ఆయన మీద అభిమానంతో నాకు ఈ సినిమాకి అవకాశము రావడం నిజంగా నా అదృష్టం” అన్నారు.

వయాకామ్, 7 స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘ఏ.ఆర్.రెహమాన్’ గారు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్ గతంలో ఐ.పి.ఎల్. సీజన్ లో ఒక జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్ లో మంచి ఆటగాడు అని తమిళ జనాలకి తెలుసు. ఇక క్రికెట్ లో ఆదరించిన తమిళ తంబీలు ఇర్ఫాన్ పఠాన్ ని సినిమా పరంగా ఆదరించడం కచ్చితంగా జరుగుతుంది అని అనుకుంటున్నారు.