సూపర్ స్టార్ సినిమాని ప్రశంసించిన  స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్!!


Indian Cricketer vvs laxman in love with Maharshi movie
Indian Cricketer vvs laxman in love with Maharshi movie

సూపర్ స్టార్ సినిమాని ప్రశంసించిన  స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్!!

 సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, దిల్ రాజు, పివిపి నిర్మించిన   ‘మహర్షి’ సినిమాను చూసి పొగడ్తలతో ముంచెత్తారు.. మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌.   సోమవారం నేను మహర్షి   సినిమాను వీక్షించానని చెపుతూ  ట్వీట్‌ చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘మహర్షి’ సినిమా చూశాను. చాలా నచ్చింది. మనకు ఓ ముఖ్యమైన, స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చిన చిత్రమిది. మహేశ్‌ మరోసారి తన పవర్‌ఫుల్‌ నటనతో ఆకట్టుకున్నారు’ అని పేర్కొన్నారు.
పూజ హేగ్దే హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషించిన  ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించి  మూడు రోజుల్లోనే వంద కోట్లు రాబట్టి మహేశ్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచినట్లు ట్రేడ్ లో వినిపిస్తోంది!!