ఫ‌స్ట్ ఇండియ‌న్ మ‌డ్ రేస్ మూవీ `మ‌డ్డీ`!

ఫ‌స్ట్ ఇండియ‌న్ మ‌డ్ రేస్ మూవీ `మ‌డ్డీ`!
ఫ‌స్ట్ ఇండియ‌న్ మ‌డ్ రేస్ మూవీ `మ‌డ్డీ`!

`బాహుబ‌లి` త‌రువాత భార‌తీయ సినిమా హాలీవుడ్ సినిమాతో పోటీకి సై అంటోందా అనే స్థాయిలో దేశ వ్యాప్తంగా సినిమాల నిర్మాణం జ‌రుగుతోంది. అబ్బుర ప‌రిచే స్ట‌న్సింగ్ విజుల‌వ్స్‌తో పాన్ ఇండియా స్థాయిని మించిన క‌థ‌, క‌థ‌నాల‌తో సినిమాలు వ‌స్తున్నాయి. ఇదే బాట‌లో వ‌స్తున్న తొలి ఇండియ‌న్ మ‌డ్ రేస్ మూవీ `మ‌డ్డీ`. బుర‌ద‌లో సాగే రేస్ నేప‌థ్యంలో అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

డా. ప్ర‌భ‌గ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో యువ‌న్‌, రిదాన్ కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పీకె 7 క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రేమ కృష్ణ‌దాస నిర్మిస్తున్నారు. క‌న్న‌డ‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా స్థాయిలో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ని బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి శుక్ర‌వారం సాయంత్రం రిలీజ్ చేశారు.

బుర‌ద‌లో రేసింగ్ నే‌ప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీ టీజ‌ర్ రేసీగా వుంది. `కేజీఎఫ్` ఫేమ్ ర‌వి బ‌స్రూర్ నేప‌థ్య సంగీతం, కె.జి.స‌తీష్ ఫొటోగ్ర‌ఫీ ఈ మూవీని హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో నిల‌బెట్టాయి. `ఫ‌స్ట్ అండ్ ఫ్యూరియ‌స్` చిత్రాల‌కు ఇండియ‌న్ వెర్ష‌న్‌ల ఈ మూవీ వుండ‌బోతంద‌న్న‌ది సుప్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రెండు వ‌ర్గాల మ‌ధ్య సాగే సాహ‌సోపేత రేస్ నేప‌థ్యంలో ఆద్యంత ఉత్కంఠ‌భ‌రితంగా తెర‌కెక్కించిన తీరు ఆక‌ట్టుకుంటోంది.