బాల‌య్య – గోపీచంద్ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా?

బాల‌య్య - గోపీచంద్ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా?
బాల‌య్య – గోపీచంద్ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా?

బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ త‌న 106  చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిబి3 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఇందులోని ఓ పాత్ర‌లో ప‌వ‌ర్‌ఫుల్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గానూ మ‌రో పాత్ర‌లో ఘోరాగానూ క‌నిపించ‌నున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ హైఓల్టేజ్ యాక్ష‌న్ మూవీని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇందులో బాల‌య్య శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నార‌ని తెలుస్తోంది. `క్రాక్`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న దర్శకుడు గోపీచంద్ ఇటీవల బాలయ్యకు శక్తివంతమైన కథను చెప్పిన‌ట్టు తెలిసింది.

ఫ్యాక్ష‌న్ క‌థ‌ల‌కు `స‌మ‌ర‌సింహారెడ్డి`తో శ్రీ‌కారం చుట్టిన బాల‌య్య మ‌రోసారి రాయలసీమ నేపథ్యంలో సాగే క‌థ‌తో ఈ మూవీ చేయ‌బోతున్నార‌ని, గ‌తంలో వ‌చ్చిన సీమ చిత్రాల‌కు పూర్తి స్థాయిలో ప‌వ‌ర్‌ఫుల్‌గా ఈ మూవీ వుండ‌నుంద‌ని తెలుస్తోంది. ప‌గా, ప్ర‌తీకారం నేపథ్యంతో పాటు నిజ జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని కూడా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌ దర్శకుడు గోపీచంద్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించ‌బోతోంది.