అఖిల్ ఈ కన్ఫ్యూజన్ ఏంది సామీ


అఖిల్ ఈ కన్ఫ్యూజన్ ఏంది సామీ

అక్కినేని అఖిల్ లాంచ్ చాలా కఠినంగా ఉంది. తన మొదటి మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పోజిషన్ లో ఉన్నాడు.ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాలుగో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం అ!, కల్కి సినిమాల ఫేమ్ ప్రశాంత్ వర్మ, అఖిల్ కి ఒక ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ ను నరేట్ చేసాడట.

అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని సమాచారం. అయితే మరోవైపు అఖిల్ కోసం పరశురామ్ కూడా నాగార్జునకు ఒక కథ వినిపించాడని వినికిడి. ఆ కథ నచ్చి నాగార్జున స్వయంగా సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇదంతా పక్కనపెడితే కొరటాల శివ నిర్మాణంలో మహేష్ హీరోగా పరశురామ్ ఒక సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లుగా మరో రూమర్ ఉంది. వీటిలో ఏది నిజమో తెలియాలంటే అఖిల్ స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సిందే.