నితిన్ పెళ్లి చేసుకోడట


intresting title for nithin next యంగ్ హీరో నితిన్ పెళ్లి చేసుకోవడానికి అంతగా సుముఖంగా లేడట ! ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాడట ! ఇది నిజంగా అభిమానులకు షాకింగ్ న్యూసే …… 35 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు నితిన్ . అయితే తాజాగా వినబడుతున్న ఆజన్మాంతం బ్రహ్మచారి అనగానే నిజం అనుకోవద్దు …… ఎందుకంటే ఓ సినిమాలో మాత్రమే సుమా ! నితిన్ పెళ్లి చేసుకోకుండా నటిస్తున్నాడట .

నాగశౌర్య హీరోగా నటించిన ”ఛలో ” చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుములతన తదుపరి చిత్రాన్ని నితిన్ తో చేయనున్నాడు . కాగా ఆ సినిమాకు ” భీష్మ ” అనే టైటిల్ పెట్టారట దానికి ట్యాగ్ లైన్ ” ఆజన్మ బ్రహ్మచారి ” . 1962 లో విడుదలైన భీష్మ ప్రేక్షకుల ఆదరణ పొందింది అయితే ఆ భీష్మ మహాభారతం కు సంబందించినది కాగా ఈ భీష్మ ఇప్పటి కాలానికి అనుగుణమైన కథ అంట . ఛలో తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల ప్రస్తుతం భీష్మ స్క్రిప్ట్ పూర్తిచేసే పనిలో ఉన్నాడు .