బాలయ్య కొత్త సినిమాకు ఆసక్తికర టైటిల్స్ పరిశీలన


Balakrishna
Balakrishna

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు ఇచ్చిన షాక్ నుండి త్వరగానే తేరుకున్నాడు. కొన్ని నెలల విరామం తీసుకుని కెఎస్ రవికుమార్ తో సినిమాను పట్టాలెక్కించాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. అంటే మరోసారి డబల్ రోల్ చేస్తున్నాడు.

ముందు నుండీ ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంటూ వస్తోంది. దాన్ని టీమ్ ఖండించకపోవడంతో అదే టైటిల్ అని ఫిక్స్ అయిపోయారంతా. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ అసలు పరిశీలించలేదట. ప్రస్తుతం రెండు టైటిల్స్ ను కన్సిడర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవే డిపార్ట్మెంట్, జడ్జిమెంట్.

ఈ రెండిట్లో ఏదో ఒక పేరుని ఫైనల్ చేసి దీపావళి లోగా ప్రకటిస్తారట. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో భూమిక కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే బాలయ్య ఐరన్ మ్యాన్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. నవంబర్ కల్లా ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసి బోయపాటి సినిమాను మొదలుపెట్టాలి బాలకృష్ణ.