కుర్ర దర్శకులలో వెంకీకి బడా డిమాండ్


కుర్ర దర్శకులలో వెంకీకి బడా డిమాండ్
కుర్ర దర్శకులలో వెంకీకి బడా డిమాండ్

విక్టరీ వెంకటేష్ తెలుగులో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించాడు. కెరీర్ మొదటినుండి ఇమేజ్ గురించి పెద్దగా పట్టించుకోకుండా తన పాత్ర అండర్ ప్లేలా ఉంటుందన్నా కూడా కథ నచ్చితే ఓకే చేసేస్తాడు. తన మీద పంచ్ లు వేయించుకునే హీరోలలో వెంకీ ఎప్పుడూ ముందుంటాడు. అయితే సీనియర్ హీరోగా వెంకటేష్ తన రేంజ్ ఏంటో, ఎలాంటి సినిమాలు తనకు నప్పుతాయో త్వరగా గ్రహించాడు. అందుకే అందరు సీనియర్ హీరోల కంటే ముందే, టాప్ హీరోలు, కుర్ర హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలకు పచ్చ జెండా ఊపేసాడు. సోలోగా సినిమా చేయలాంటి గురు వంటి దమ్మున్న సినిమాలే సైన్ చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒప్పుకున్నదే అసురన్ రీమేక్. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం పట్ల వెంకీ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. సురేష్ బాబును ఒప్పించి మరీ ఈ సినిమా చేద్దామన్నట్లుగా వెంకీ చేసాడని ఒక రూమర్ ఉంది.

ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్యతో కలిసి నటించిన వెంకీ మామ విడుదలై అదిరిపోయే రేంజ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సో వెంకీ నెక్స్ట్ దృష్టి అసురన్ రీమేక్ పైనే. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడిగా ఎంపికైన విషయం తెల్సిందే. అసురన్ రీమేక్ వెంకీ కెరీర్ లో 74వ చిత్రం. దీన్ని నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి వేసవికల్లా విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అసురన్ రీమేక్ సంగతి పక్కనపెడితే వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రం ఏమిటనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ స్పెషల్ చిత్రాన్ని తెరకెక్కించడానికి ఇద్దరు కుర్ర దర్శకులు పోటీ పడుతున్నట్లు సమాచారం.

అందులో ఒకరు తరుణ్ భాస్కర్ కాగా మరొకరు అనిల్ రావిపూడి. ఎఫ్ 2 సక్సెస్ తర్వాత ఎఫ్ 3 సబ్జెక్ట్ రాస్తున్నట్లు అనిల్ రావిపూడి ప్రకటించాడు. అలాగే, తరుణ్ భాస్కర్ కూడా మీకు మాత్రమే చెప్తా మీడియా ఇంటరాక్షన్ లో వెంకటేష్ హీరోగా ఒక కథను రాస్తున్నట్లు స్పష్టం చేసాడు. మరి వీరిద్దరిలో వెంకీ ఓటు ఎవరికో అన్నది ఆసక్తికరంగా మారింది. టాప్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు వెంకటేష్ తో సినిమా చేద్దామని ప్రయత్నిస్తున్నాడు కానీ అది ఎప్పటికి కుదురుతుందో ఇప్పుడే చెప్పలేం.