ప్రభాస్ పెళ్లి గురించి గొడవలయ్యాయా


internal fighting on prabhas marriage

జూన్ కూడా అయిపోవస్తోంది , కానీ ఇంతవరకు ప్రభాస్ పెళ్లి గురించి చడీ చప్పుడు లేకుండా పోయింది దాంతో ఈ ఏడాది కూడా ప్రభాస్ పెళ్లి లేనట్లే అని అంటున్నారు . అంతేకాదు ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి విషయంలో ఇకపై మేము అతడి పై ఎలాంటి ఒత్తిడి తీసుకువచ్చేది లేదని అతడు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసుకుంటాడు ……. అలాగే పెళ్లి కూతురు కూడా ఎవరని అడగం అంటూ తన సన్నిహితుల వద్ద చెబుతున్నాడట . కృష్ణంరాజు లో ఇంతగా వేదాంతం రావడానికి కారణం ప్రభాస్ ఎందుకంటే రెండు మూడేళ్ళ నుండి ప్రభాస్ పెళ్లి చేయాలనీ కృష్ణంరాజు చేయని ప్రయత్నాలు లేవు కానీ ప్రభాస్ మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ కాలాన్ని నెట్టుకుంటూ వస్తున్నాడు .

అయితే ఈ ఏడాది మాత్రం తప్పకుండా పెళ్లి ఉంటుంది అని ఇద్దరు కూడా అనుకున్నారు ప్రకటించారు కూడా కట్ చేస్తే ….. ఎక్కడ తేడా కొట్టిందో కానీ ప్రభాస్ పెళ్లి అతడిష్టమని , మేము జోక్యం చేసుకోమని చెప్పేశాడట కృష్ణంరాజు . ఇంతగా వైరాగ్యం చెందడానికి లోలోన పెద్ద తతంగమే జరిగిందట . ప్రభాస్ – అనుష్క ల పెళ్లి అంటూ రకరకాల పుకార్లు షికారు చేసాయి , అనుష్క ని పెళ్లి చేసుకోవడం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదని గుసగుసలు కూడా వినిపించాయి . దాంతో ప్రభాస్ పెళ్లి ఆలస్యం అవుతోందని వార్తలు వస్తున్నాయి . ఏది ఏమైనా ఈ ఏడాది కూడా ప్రభాస్ పెళ్లి లేనట్లే అని తెలుస్తోంది . మరి 2019 లో నైనా పెళ్లి కొడుకు అవుతాడా చూడాలి .