ఆర్ ఆర్ ఆర్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందట


ఆర్ ఆర్ ఆర్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేసాడట ఓటమి ఎరుగని జక్కన్న . ఎస్ ఎస్ రాజమౌళి ఇంతవరకు దర్శకత్వం వహించిన చిత్రాలలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయే రేంజ్ లో రాసుకుంటాడు అలాగే అంతకుమించిన హై వోల్టేజ్ తో చిత్రీకరిస్తాడు ఇక దానికి కీరవాణి అందించే నేపథ్య సంగీతం స్కై లెవల్లో ఉంటుంది దాంతో థియేటర్ లో ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తూ సినిమా అంటే ఇదేరా ! అనే రేంజ్ లో ఈలలు వేస్తుంటారు గోల చేస్తుంటారు .

మాస్ ప్రేక్షకుల నాడి బాగా పసిగట్టిన ఎస్ ఎస్ రాజమౌళి తన సినిమాలో సెంటిమెంట్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ అలాగే పీక్స్ లో ఉండే యాక్షన్ సీన్స్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు జక్కన్న . ఇక ఆర్ ఆర్ ఆర్ లో కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ , ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ , ఇంట్రోడాక్షన్ సీన్స్ హైలెట్ గా ఉంటాయట . ఎన్టీఆర్ రాంచరణ్ లు హీరోలు కావడంతో వాళ్ల ఇమేజ్ కు తగ్గట్లుగా భారీ లెవల్లో ఉంటాయట యాక్షన్ సీన్స్ .