నేచుర‌ల్ స్టార్ కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్‌!

Intrestung Title for Nani 27
Intrestung Title for Nani 27

మ‌న హీరోలు స్పీడు పెంచారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ షాకిస్తున్నారు. ఏడాదికి ఒకే ఒక్క సినిమాతో ప్రేక్ష‌కుల ముందు వ‌చ్చే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత వ‌రుస చిత్రాల్ని ప్ర‌క‌టిస్తూ ఫ్యాన్స్‌కి షాకుల మీద షాకులిస్తున్నారు. అదే పంథాని నేచుర‌ల్ స్టార్ నాని కూడా ఫాలోఅవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

`గ్యాంగ్ లీడ‌ర్` త‌రువాత స్పీడు పెంచిన నాని వ‌రుస‌గా మూడు చిత్రాల్ని లైన్‌లో పెట్ట‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. హీరో సుధీర్‌బాబుతో క‌లిసి క్రైమ్ థ్రిల్ల‌ర్ `వి`చిత్రాన్ని ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ దర్శ‌క‌త్వంలో చేస్తున్న నాని ఈ సినిమా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో వుండ‌గానే శివ నిర్వాణ దర్శ‌క‌త్వంలో `ట‌క్ జ‌గ‌దీష్‌`ని మొద‌లుపెట్టేశాడు. ఇప్ప‌టికే ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండ‌వ డ్యూల్‌కు రెడీ అయిపోతోంది. ఇదిలా వుంటే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో మ‌రో చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశారు.

నాని న‌టించున్న 27వ చిత్ర‌మిది. ఈ రోజు (సోమ‌వారం) హీరో నాని పుట్టిన రోజు ఈ సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని నానితో చేయ‌బోతున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. స‌రికొత్త క‌థ క‌థ‌నాల‌తో రూపొంద‌నున్న ఈ చిత్రానికి `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ చిత్రానికి `శ్యామ్ సింగ రాయ్‌` అనే ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌ని చిత్ర బృందం ఖ‌రారు చేసిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర బృందం సోమ‌వారం ప్ర‌క‌టించే అవ‌కాశం వుంది.