ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఎంట్రన్స్ ఇలాగే ఉండబోతోంది


Jr Ntr
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఎంట్రన్స్ ఇలాగే ఉండబోతోంది

దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న దర్శకుడు. తెలుగు సినిమాకు అగ్ర దర్శకుడు. బాహుబలి వంటి కనీవినీ ఎరుగని హిట్ తర్వాత రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం రీసెంట్ గా బల్గేరియాలో ఒక షెడ్యూల్ ను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న విషయం తెల్సిందే. త్వరలో హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది.

బల్గేరియా షెడ్యూల్ లో ఎన్టీఆర్ కు సంబందించిన పరిచయ సన్నివేశాన్ని చిత్రీకరించారట. రాజమౌళి ప్రతి సినిమాలో హీరోకి అదిరిపోయే ఎంట్రీ ఇస్తాడు. అలాగే ఆర్ఆర్ఆర్ లో కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు స్పెషల్ ఎంట్రీలు ప్లాన్ చేసాడట రాజమౌళి. ఎన్టీఆర్ పరిచయం పులితో ఫైట్ సీక్వెన్స్ ద్వారా జరుగుతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీం పాత్ర భుజబలంతో ఉన్నట్టుగా క్యారెక్టర్ ను తీర్చిదిద్దారట. మరి వింటుంటేనే ఇలా ఉంటే సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రన్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవడం గ్యారంటీ.