ఐపిసి సెక్షన్ భార్యాబంధు రివ్యూ


IPC Section Bharya Bandhu review

ఐపిసి సెక్షన్ భార్యాబంధు రివ్యూ :
నటీనటులు : శరత్ చంద్ర , నేహా దేశ్ పాండే , ఆమని
సంగీతం : విజయ్ కూరాకుల
నిర్మాత : ఆలూరి సాంబశివరావు
దర్శకత్వం : రెట్టడి శ్రీనివాస్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 29 జూన్ 2018

ఐపిసి సెక్షన్ 498 ఏ భార్యాబంధు అనే చట్టం నేపథ్యంలో రూపొందిన చిత్రం ” ఐపిసి సెక్షన్ భార్యాబంధు ” . శరత్ చంద్ర – నేహా దేశ్ పాండే జంటగా ఆమని కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

కథ :

భర్తలను ఇబ్బంది పెడుతూ పైగా ఐపీసీ సెక్షన్ 498 ఏ భార్యాబంధు చట్టాన్ని ఉపయోగించి మగాళ్ల ని ఆడుకునే మహిళల నుండి కాపాడాలని , ఆ చట్టాన్ని రద్దు చేశాకే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు లాయర్ వినాయకరావు ( శరత్ చంద్ర ) , అయితే మహిళల పట్ల అంత అనుకూలంగా లేని వినాయకరావు శృతి ( నేహా దేశ్ పాండే ) ని చూసి లవ్ లో పడతాడు .శృతి కూడా వినాయకరావు ని ఇష్టపడుతుంది కానీ తీరా ఆ ప్రేమని వ్యక్తం చేసే సమయానికి అతడిని ద్వేషిస్తుంది . అసలు వినాయకరావు మహిళల పట్ల , ఐపీసీ సెక్షన్ 498 ఏ భార్యాబంధు చట్టం పట్ల ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాడు ? చివరకు అతడు అనుకున్నది సాధించాడా ? శృతి ప్రేమని పొందాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

కథ
నేహా దేశ్ పాండే

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

శరత్ చంద్ర కొత్తవాడు అయినప్పటికీ బాగానే నటించాడు . అయితే ఇంకా నటనలో మరింతగా రాణించాల్సిన అవసరం ఉంది . మొదటి ప్రయత్నం మంచి ప్రయత్నమే చేసాడు . హీరోయిన్ నేహా దేశ్ పాండే నటన తో పాటు గ్లామర్ తో అలరించింది . సీనియర్ నటి ఆమని కీలక పాత్ర పోషించింది . బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన వాసు ఇంటూరి నటన ఫరవాలేదు . రాగిణి , మధుసూదన్ పాత్రలు ఫరవాలేదనిపించాయి . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు రాణించారు .

సాంకేతిక వర్గం :

దర్శకులు రెట్టడి శ్రీనివాస్ మంచి పాయింట్ ని ఎంచుకున్నాడు . ఇప్పుడు నగరాల్లో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ తో నలిగిపోతున్న వాళ్ళు ఎందరో ఎందరెందరో . ఐపీసీ సెక్షన్ 498 ఏ భార్యాబంధు చట్టం తో ఎదురౌతున్న ఇబ్బందులను చూపించే మంచి ప్రయత్నం చేసాడు దర్శకుడు అయితే స్క్రీన్ ప్లే పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది . ఆలూరి క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి . శ్యామ్ అందించిన ఛాయాగ్రహణం బాగుంది , అలాగే విజయ్ కూరాకుల అందించిన సంగీతం ఫరవాలేదు .

English Title: IPC Section Bharya Bandhu review