చీక‌టి గ‌దిలో… మ‌రోసారి చిత‌క్కొట్టేస్తార‌ట‌!


చీక‌టి గ‌దిలో... మ‌రోసారి చిత‌క్కొట్టేస్తార‌ట‌!
చీక‌టి గ‌దిలో… మ‌రోసారి చిత‌క్కొట్టేస్తార‌ట‌!

అడ‌ల్డ్ కామెడీని ఉప‌యోగించి హార‌ర్ చిత్రాల్ని గ‌త కొంత కాలంగా ఏక్తాక‌పూర్ బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అడ‌ల్ట్ సినిమాల‌తో పాటు `గందీబాత్‌` పేరుతో అడ‌ల్ట్ సిరీస్‌ల‌ని అందిస్తున్నారు. ఇదే ఫార్ములాతో త‌మిళంలో వ‌చ్చిన చిత్రం `ఇర‌ట్టు అరైయిల్ ముర‌ట్టు కుత్తు`. గౌత‌మ్ కార్తీక్, వైభ‌వీచంద్ర‌, య‌షికా ఆనంద్‌, చంద్రికా ర‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సంతోష్ పి. జ‌య‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఇ.జ్ఞాన‌వేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రం త‌మిళంలో లాభాల పంట‌పండించింది.

ఇదే చిత్రాన్ని తెలుగులే `చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు` పేరుతో రీమేక్ చేశారు. ఆదిత్ అరుణ్‌, య‌శ్వంత్, య‌షిక ఆనంద్‌, చంద్రిక ర‌వి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. తెలుగులోనూ ఈ చిత్రం భారీ వ‌సూళ్ల‌నే రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ను విస్మ‌య‌ప‌రిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్ 2ను రూపొందిస్తున్నారు. ఇటీవ‌లే సీక్ఎల్ చెన్నైలో మొద‌లైంది. రెండ‌వ భాగాన్ని తొలి భాగానికి మించి మ‌రింత కొత్త‌గా ద‌ర్శ‌కుడు జ‌య‌కుమార్ అందించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. తొలి భాగంలో న‌టించిన గౌత‌మ్ కార్తీక్, వైభ‌వీచంద్ర‌, య‌షికా ఆనంద్‌, చంద్రికా ర‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మిళ వెర్ష‌న్ పూర్త‌యిన త‌రువాతే తెలుగు వెర్ష‌న్‌ని ప్రారంభించే అవ‌కాశాలు వున్న‌ట్టు తెలిసింది.