నిజంగా 400 కోట్లు వచ్చాయా ?


Is 2.0 collections are Fake

నాలుగు రోజుల్లో 2. ఓ చిత్రం నాలుగు వందల కోట్లు వసూల్ చేసిందని అఫీషియల్ గా నిన్న ప్రకటించారు ఆ చిత్ర బృందం . అయితే నాలుగు వందల కోట్లు అని చెప్పారు తప్ప ఏరియాల వారీగా మాత్రం ఆ లెక్కలు ప్రకటించలేదు దాంతో ఆ వసూళ్ల పై అనుమానాలు నెలకొన్నాయి . రజనీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ లు కీలక పాత్రల్లో నటించిన 2. ఓ చిత్రం 550 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది . విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 29 న విడుదల అయ్యింది .

మొదటి రోజు బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని భావించారు అందరూ అయితే ఆ రికార్డులను టచ్ చేయలేకపోయింది 2. ఓ . కానీ మొదటి రోజున వంద కోట్లకు పైగా వసూల్ చేసి భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది . అయితే ఆ తర్వాత ఆ జోరు ఉంటుంది అనుకుంటే ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు . కాకపోతే శని , ఆదివారాలు కలిసి వచ్చాయి కాబట్టి నాలుగు రోజుల్లో 300 కోట్ల పైన వసూల్ చేసి ఉండొచ్చు కానీ ఏకంగా 400 కోట్లు వసూల్ అయినట్లు ప్రకటించారు . దాంతో అనుమానం వ్యక్తం అవుతోంది . మొత్తానికి రజనీకాంత్ సాలిడ్ హిట్ కొట్టలేక పోతున్నాడు . 2. ఓ భారీ వసూళ్లు సాధిస్తోంది కాకపోతే 550 కోట్ల బడ్జెట్ ముందు వసూల్ అవుతోంది తక్కువే !

English Title: Is 2.0 collections are Fake ?