అమైరా దస్తూర్ ని ఇబ్బందిపెట్టింది ఈ హీరోనా ?


Is amyra dastur allegations on dhanush ?

గతకొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ చిత్రపరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పలువురు హీరోయిన్ లు తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. కాగా అందులో భాగంగానే అందాల భామ అమైరా దస్తూర్ కూడా తనకు కూడా లైంగిక వేధింపుల అనుభవం ఉందని కుండబద్దలు కొట్టింది. బాలీవుడ్ లో ఇబ్బంది పెట్టారు అలాగే సౌత్ లో కూడా నాకు లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయయని అయతే ఆ సౌత్ స్టార్ కు పలుకుబడి ఎక్కువ ! అంతేనా అతడి కుటుంబానికి కూడా పలుకుబడి ఉందని అందుకే అతడి పేరు వెల్లడించడం లేదని పెద్ద బాంబ్ పేల్చింది. అయితే అమైరా దస్తూర్ ఆరోపించిన హీరో ధనుష్ అని చెప్పకనే చెప్పింది .

ధనుష్ సరసన మొదట తమిళ చిత్రం అనేగన్ లో నటించింది అమైరా దస్తూర్ . ఆ తర్వాత తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది. రాజ్ తరుణ్ , సందీప్ కిషన్ ల సరసన రెండు చిత్రాల్లో నటించింది , అయితే ఆ ఇద్దరిలో రాజ్ తరుణ్ అయితే క్రేజ్ లేదు , బ్యాగ్రౌండ్ లేదు . ఇక సందీప్ కిషన్ విషయానికి వస్తే …… బ్యాగ్రౌండ్ ఉంది కాని సందీప్ పెద్ద హీరో కాదు. ఇక మిగిలింది ధనుష్ మాత్రమే . ధనుష్ స్టార్ హీరో పైగా సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు కాబట్టి అని అర్థం అవుతోంది. నేరుగా అయితే చెప్పలేదు కానీ ధనుష్ అనే అర్థం వస్తోంది అమైరా దస్తూర్ చెప్పిన దాన్ని బట్టి.

English Title: Is amyra dastur allegations on dhanush ?