అనసూయ సిల్క్ స్మితగా మారుతుందా?

అనసూయ సిల్క్ స్మితగా మారుతుందా?
అనసూయ సిల్క్ స్మితగా మారుతుందా?

జబర్దస్త్ కామెడీ షోతో విపరీతమైన పేరు వచ్చింది అనసూయకు. ఆ షో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆమె గ్లామర్ తో షో కు అదనపు ఆకర్షణ వచ్చింది. ఇప్పటికీ తన హాట్ లుక్స్ తో అనసూయ ఈ షో ను రక్తికట్టిస్తుంది. అయితే బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా అడపాదడపా అనసూయ సినిమాల్లో కూడా నటిస్తోంది.

రంగస్థలం సినిమాలో పోషించిన రంగమ్మత్త పాత్రతో అనసూయ రేంజ్ పూర్తిగా మారిపోయింది. తన మనసుకు దగ్గరైన సినిమాలను మాత్రం ఎంచుకుంటూ అనసూయ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ హాట్ యాంకర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న ఖిలాడీ చిత్రంలో కూడా అనసూయ ఒక మంచి పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.

ఇక అనసూయ రీసెంట్ గా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికంగా తెలియజేసిన సంగతి తెల్సిందే. విజయ్ సేతుపతి సినిమాలో ఆమె ప్రముఖ పాత్ర పోషిస్తోందని అన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె సిల్క్ స్మిత పాత్రను పోషిస్తోందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో వచ్చే అవకాశముంది.