ఆర్ ఆర్ ఆర్ లో అనుష్క ?


రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ” . జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో తళుక్కున మెరిసే పాత్రలో అనుష్క నటించనున్నట్లు తెలుస్తోంది . ఒకవైపు గ్లామర్ పాత్రలు పోషిస్తునే మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల్లో మెప్పిస్తున్న భామ అనుష్క . పైగా అనుష్కతో రాజమౌళి కి ప్రతేకమైన అనుబంధం కూడా . రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో కథానాయికగా నటించింది అనుష్క .

300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూడో షెడ్యూల్ జరగాల్సి ఉన్నప్పటికీ చరణ్ కాలుకి గాయం కావడంతో పాటుగా ఎన్టీఆర్ చేతికి కూడా చిన్న గాయం కావడంతో షూటింగ్ వాయిదాపడింది . ఎన్టీఆర్ , చరణ్ లకు తోడుగా సాలిడ్ అందాల భామ అనుష్క కూడా జాయిన్ అయితే ఇక ఈ సినిమా గురించి కొత్తగా చెప్పాలా ? అనుష్క మాత్రమే కాదు ప్రభాస్ కూడా మెరుపు తీగలా కనిపించనున్నాడని టాక్ . అయితే జక్కన్న ఈ విషయం ద్రువీకరించాల్సి ఉంది .