దిల్ రాజు ఆ సినిమాని నిర్మించడం లేదా


Is Dil raju out from bharateeyudu 2 1996 లో విడుదలైన భారతీయుడు దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది . కమల్ హాసన్ ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే . కాగా 22 సంవత్సరాల తర్వాత భారతీయుడు చిత్రానికి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేసారు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడానికి దిల్ రాజు ముందుకు వచ్చాడు కట్ చేస్తే ఇప్పుడు ఆ సినిమాకు ఏ ఎం రత్నం నిర్మాత అని తెలుస్తోంది . భారతీయుడు మొదటి భాగానికి ఏ ఎం రత్నం నిర్మాత అయితే ఆ తర్వాత తన కొడుకు ని హీరోగా నిలబెట్టాలని చేసిన కొన్ని సినిమాలు దెబ్బకొట్టడంతో లైమ్ లైట్ లో లేకుండా పోయాడు. అయితే అలాంటి నిర్మాతకు హీరో అజిత్ మళ్ళీ సినిమాలు చేయడంతో మళ్ళీ ఆర్ధికంగా నిలదొక్కుకున్నాడు .

ఇక త్వరలోనే భారతీయుడు సెట్స్ మీదకు వెళ్లనుంది అని తెలుస్తున్న సమయంలో భారతీయుడు 2 కి దిల్ రాజు నిర్మాత కాదు ఏ ఎం రత్నం అని వినబడుతుండటంతో దిల్ రాజు – ఏ ఎం రత్నం లు సంయుక్తంగా నిర్మించనున్నారా ? లేక దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడా తెలియాల్సి ఉంది .

English Title: Is Dil raju out from bharateeyudu 2 ?