మహేష్ నిర్మాత తప్పుకున్నాడట


మహేష్ నిర్మాత తప్పుకున్నాడట
దిల్ రాజ్ మరియు మహేష్ బాబు

మహేష్ బాబు తో సినిమా చేయడానికి ఏ నిర్మాత అయినా ముందుకు వస్తాడు కానీ దిల్ రాజు మాత్రం నాకొద్దు బాబోయ్ అంటూ తప్పుకుంటున్నాడని తెలుస్తోంది . మహర్షి సినిమా రిలీజ్ కి ఉంటే ఇంకా తప్పుకోవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? మహర్షి చిత్రం నుండి కాదు త్వరలోనే మళ్ళీ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రం నుండి దిల్ రాజు తప్పుకున్నట్లు తెలుస్తోంది .

ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు . అయితే ఈ సినిమాకు అనిల్ సుంకర తో పాటుగా దిల్ రాజు కూడా నిర్మాణ భాగస్వామి గా ఉన్నాడు . ఇక షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అని అనుకుంటున్న ఈ సమయంలో దిల్ రాజు తప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా …… మహర్షి చిత్రాన్ని ముగ్గురు కలిసి నిర్మించడం , ఆ సినిమా బిజినెస్ లో పెద్ద తలనొప్పులు ఎదురు కావడంతో దిల్ రాజు డ్రాప్ అవుతున్నట్లు తెలుస్తోంది .