డాక్టర్ రాజశేఖర్ తదుపరి సినిమా ఈ దర్శకుడి తోనేనా ?


DR. Rajasekhar
DR. Rajasekhar

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఇటీవలే కల్కి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దాంతో తన తదుపరి చిత్రాన్ని ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో చేయాలో తెలీని అయోమయంలో ఉన్నాడు . సరిగ్గా ఇలాంటి సమయంలోనే రాజశేఖర్ మాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా దర్శకులు వీరభద్రం చౌదరి ఓ కథ రూపొందించాడట .

అది రాజశేఖర్ కు చెప్పినట్లు తెలుస్తోంది . ఇక రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది సెట్స్ మీదకు వెళ్లనుంది . వీరభద్రం చౌదరి ఇంతకుముందు ” అహనా పెళ్ళంట ” , ” పూల రంగడు ” వంటి సూపర్ హిట్స్ తీసాడు . అలాగే చుట్టాలబ్బాయి అనేహిట్ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు . ఇప్పుడు రాజశేఖర్ కోసం ఎదురు చూస్తున్నాడు . రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాన్ని పట్టాలెక్కించడానికి చుట్టాలబ్బాయి చిత్ర నిర్మాతలలో ఒకరు ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడట .