హన్సిక మళ్ళీ శింబు ని ప్రేమిస్తోందా ?


బొద్దుగుమ్మ హన్సిక శింబు ప్రేమించుకున్న విషయం తెల్సిందే . అయితే ఆ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్ళలేదు మధ్యలోనే ఆగిపోయింది . దాంతో శింబు – హన్సిక ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విబేధాలు ఏర్పడ్డాయి . కట్ చేస్తే ఆ వ్యవహారం జరిగి చాలా రోజులు అయ్యింది కాబట్టి ఇద్దరి మధ్య ఉన్న కోపతాపాలు కూడా తగ్గిపోయాయి . ఇక ఇప్పుడు మళ్ళీ శింబు పై ప్రేమని ఒలకబోస్తోంది హన్సిక .

తాజాగా ఈ భామ ” మహా ” అనే చిత్రంలో నటిస్తోంది . హన్సిక కు ఇది యాభయ్యవ సినిమా కావడం విశేషం . ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ , సెకండ్ లుక్ , థర్డ్ లుక్ లతో వివాదాన్ని రాజేసింది . కాగా ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వమని శింబు ని దర్శకుడి చేత అడిగించిందట ! ప్రేయసి స్వయంగా ఓ దర్శకుడ్ని పంపడంతో శింబు కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . అంతేకాదు లొకేషన్ లో ఇద్దరి మధ్య మళ్ళీ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుండటంతో శింబు ని హన్సిక మళ్ళీ ప్రేమిస్తోంది అంటూ పుకార్లు మొదలయ్యాయి .