ఇస్మార్ట్ శంకర్ ప్లాప్ అని భయపడ్డాడా ?

ISmart Shankar
ISmart Shankar

ఇస్మార్ట్ శంకర్ ప్లాప్ అవుతుందని భయపడినట్లున్నాడు హీరో రామ్ , అందుకే రిలీజ్ కి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఫారిన్ వెళ్ళిపోయాడు . దాంతో దర్శకులు పూరి జగన్నాధ్ , హీరోయిన్ లు నభా నటేష్ , నిధి అగర్వాల్ , ఛార్మి తదితరులు మాత్రమే ప్రమోషన్ చేస్తున్నారు ఇస్మార్ట్ శంకర్ గురించి . అయితే హీరో రామ్ మాత్రం విడుదలకు ముందే ఫారిన్ ట్రిప్ వేసాడు .

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ఎలాగోలా చేసాం కానీ హిట్ అవుతుందన్న నమ్మకం లేదట హీరోకు . అందుకే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా వెళ్ళిపోయాడు హ్యాండ్ ఇచ్చి . జూలై 18 న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . దాంతో రేపటితో ఈ సినిమా పెట్టుబడి వచ్చేలా కనబడుతోంది . అంటే సూపర్ హిట్ అన్నమాటే మరి .