నాగశౌర్య కొత్త సినిమా టైటిల్ భలే ఉందే !


Is it Palana abbayi Palana ammayi title for Nagashourya

నాగశౌర్య హీరోగా నటించనున్న కొత్త చిత్రానికి ” ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి ” అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది . అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగశౌర్య సరసన మలయాళ భామ మాళవిక నాయర్ నటించనుంది . నాగశౌర్య – మాళవిక నాయర్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు ” కల్యాణ వైభోగమే ” అనే హిట్ చిత్రం వచ్చింది .

 

ఇక నాగశౌర్య – అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఊహలు గుసగుసలాడే , జ్యో అచ్యుతానంద చిత్రాలు వచ్చాయి , ఆ రెండు కూడా మంచి హిట్ అయ్యాయి . దాంతో ఈ కాంబినేషన్ కు క్రేజ్ ఏర్పడింది . ఇక ఈ క్రేజ్ కు తోడు ” ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి ” అనే టైటిల్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది . ఇంట్రెస్టింగ్ టైటిల్ ని పెట్టడం ద్వారా సినిమాపై అంచనాలు పెరిగేలా చేయడం ఖాయం .

English Title: Is it Palana abbayi Palana ammayi title for Nagashourya