ఎన్టీఆర్ ని రిజెక్ట్ చేసిన జాన్వీ కపూర్ !


Jhanvi kapoor  and Jr.NTR
Jhanvi kapoor and Jr.NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించడానికి ఏ హీరోయిన్ అయినా పోటీ పడతారు కానీ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మాత్రం ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ వస్తే నో చెప్పేసిందట . అయితే ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ని ఎందుకు వద్దనుకుందో తెలుసా ……. పాత్ర నిడివి తక్కువ కావడంతో పాటుగా అలియా భట్ లా తన పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడమే అని తెలుస్తోంది .

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి పలువురు నటీనటులు పోటీ పడతారు కానీ బాహుబలి చిత్రంలో నటించే ఛాన్స్ వస్తే శ్రీదేవి నిరాకరించి అప్పట్లో వార్తల్లోకెక్కింది . కట్ చేస్తే అదే పాత్రని రమ్యకృష్ణ చేసి నీరాజనాలు అందుకుంది . ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ సరసన ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో  నటించే ఛాన్స్ వస్తే జాన్వీ నో చెప్పినట్లు తెలుస్తోంది . ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలయ్యే సినిమా కాబట్టి జాన్వీ చేస్తే బాగుండేది ఖచ్చితంగా .