ఎన్టీఆర్ కు గాయమైందా ?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు గాయం అయినట్లు తెలుస్తోంది . ఎన్టీఆర్ కుడి చేయి కి కట్టు కట్టి ఉండటంతో ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది . తాజాగా ఎన్టీఆర్ చేతికి కట్టు ఉన్న ఫోటో లీక్ కావడంతో ఎన్టీఆర్ కు గాయం అయినట్లు వార్తలు హల్చల్ చేసున్నాయి . ఇప్పటికే రాంచరణ్ కాలికి గాయం కావడంతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే . తాజాగా ఎన్టీఆర్ చేతికి గాయం అయినట్లు వార్తలు వస్తుండటంతో మరోసారి ఆర్ ఆర్ ఆర్ కి ఇబ్బంది తప్పేలా కనిపించడం లేదు .

దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఒకవైపు హీరోయిన్ సమస్య బాధిస్తుండగా తాజాగా హీరోల గాయాలతో మరింతగా షెడ్యూల్స్ అప్ సెట్ అవుతున్నాయి . దాంతో రాజమౌళి కి టెన్షన్ పెరిగిపోతోందట . ఎన్టీఆర్ చేతి గాయం అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది . అంటే ఇప్పట్లో ఆర్ ఆర్ ఆర్ సెట్స్ మీదకు వెళ్తుందా ?