బాలీవుడ్ వాళ్లు మన సినిమాని కాపీ కొట్టారా


is-kajols-helicopter-eela-film-copy-from-telugu-film1992 లో మహానటుడు అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన ” కాలేజీ బుల్లోడు ” సూపర్ హిట్ అయ్యింది . శరత్ దర్శకత్వంలో బలరామ్ నిర్మించిన ఆ చిత్రంలో అక్కినేని నాగేశ్వర్ రావు తన పరువు కోసం , పట్టుదల కోసం కొడుకు చదివే కాలేజీ లో చేరి డిగ్రీ పట్టా అందుకుంటాడు . బాగా డబ్బున్న వ్యక్తి అయినప్పటికీ చదువు ఉండదు దాంతో ముసలి వయసులో పట్టుదలతో డిగ్రీ పట్టా పొందుతాడు కట్ చేస్తే దానికి రివర్స్ లో కొడుకు చదివే కాలేజీ లో తల్లి చదువుకొని డిగ్రీ పట్టా పొంది తన ఆత్మాభిమానాన్ని చాటుకుంటుంది , ఇదే కథతో ఇప్పుడు బాలీవుడ్ లో రూపొందిన చిత్రం ” హెలికాఫ్టర్ ఈల ” .

ఒకప్పటి హాట్ భామ కాజోల్ ప్రధాన పాత్రలో నటించింది . ఆ చిత్రంలో తండ్రి డిగ్రీ పట్టా అందుకుంటాడు ఈ బాలీవుడ్ చిత్రంలో తల్లి డిగ్రీ పట్టా అందుకుంటుంది మిగదంతా సేమ్ టు సేమ్ అన్నట్లుగా చెబుతున్నారు . ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నారు అది విడుదల అయితేనే కానీ తెలీదు పూర్తిగా మన కథ ని కాపీ కొట్టి తీసారా ?లేదా ? అన్నది . కాపీ కొట్టడం అన్నది ఈరోజుల్లో కామన్ అయిపొయింది . ఇక కాపీనా ? లేదా అన్నది సెప్టెంబర్ 7న తేలనుంది . అప్పట్లో కాలేజీ బుల్లోడు ఘనవిజయం సాధించింది మరి ఈ హెలికాఫ్టర్ ఈల ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి .