మోహన్ బాబు కు పదవీయోగం !


మంచు మోహన్ బాబు కు పదవీయోగం దక్కనున్నట్లు తెలుస్తోంది . మోహన్ బాబు జగన్ కు బంధుత్వం ఉంది , అలాగే ఎన్నికల ముందు జగన్ పార్టీలోకి చేరాడు అంతేకాదు ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించాడు . సినిమా రంగానికి చెందిన చాలామంది జగన్ పార్టీకి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రచారం కూడా చేసారు అయితే మిగతా వాళ్ళ కంటే మోహన్ బాబు ఎక్కువే జగన్ కు ఎందుకంటే మామయ్య అవుతాడు కాబట్టి .

పైగా చంద్రబాబు సమకాలీకుడు కాబట్టి అతడి బలం , బలహీనతలు తెలుసు కాబట్టి మోహన్ బాబు కు ఏదైనా పదవి లభించడం ఖాయమని అంటున్నారు . తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి లేదా మరో పదవి మోహన్ బాబు వశం అవ్వడం ఖాయమని తెలుస్తోంది . పైగా మోహన్ బాబు తిరుపతిలో విద్యాసంస్థలను నెలకొల్పాడు కూడా దాంతో టిటిడి చైర్మన్ అవ్వొచ్చు అని తెలుస్తోంది . మోహన్ బాబు కు మాత్రమే కాకుండా ఇతర సినీ నటీనటులకు కూడా తగిన ప్రాధాన్యత లభించడం ఖాయమని వినబడుతోంది .