నిఖిల్ శ్వాస సినిమా ఆగిపోయిందా ?


Swasa
Swasa

నిఖిల్ హీరోగా నటించిన అర్జున్ సురవరం విడుదల కావడం లేదంటే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది . శ్వాస అనే చిత్రాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు . పైగా చిత్రంలో హీరోయిన్ గా నివేదా థామస్ ని ఎంపిక చేసారు . నివేదా థామస్ సినిమా ఒప్పుకుందంటే తప్పకుండా సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అన్న నానుడి ఉంది

అయితే శ్వాస చిత్రానికి శ్వాస అందడం లేదని , అది ఇప్పుడు కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది . దర్శక నిర్మాతల మధ్య అలాగే హీరో కు ఇలా రకరకాల కారణాలతో శ్వాస సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది . అయితే గతంలోనే ఇలాంటి వార్తలు రాగా అబ్బే ! అటువంటిదేమీ లేదు త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది అని అన్నాడు నిర్మాత . కట్ చేస్తే సెట్స్ మీదకు వెళ్లిన దాఖలాలు మాత్రం లేవు . దాంతో శ్వాస చిత్రం ఆగిపోయిందని గుసగుసలు మొదలయ్యాయి . అయితే ఆగిపోయిందా ? లేక వాయిదా పడిందా ? అన్నది తెలియాలంటే దర్శక నిర్మాతలో లేక హీరో నో స్పందించాలి మరి