ఎన్టీఆర్ భార్య గా నిత్యామీనన్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా ఆ కొమరం భీం భార్య పాత్రలో మలయాళ భామ నిత్యామీనన్ నటించనున్నట్లు తెలుస్తోంది . నిత్యామీనన్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో నిత్యా ఆ పాత్ర చేయడానికి సంతోషంగా ముందుకు వచ్చిందట .

కొమరం భీం కు ఇద్దరు భార్యలు కాగా అందులో ఒక భార్యగా నిత్యామీనన్ నటించనుంది . ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 2020 జూన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు . చరణ్ కాలికి గాయం కావడంతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది . ఇక ఈ నెలాఖరున ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కానుంది .