పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కు డేట్స్ ఇస్తాడా ?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే . ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి కాబట్టి ఇప్పట్లో పవన్ కళ్యాణ్ వేరే పని లేకుండాపోయింది . రాజకీయాలకు మళ్ళీ సమయం కేటాయించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఈలోపు మళ్ళీ సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నాడట . ఇంకేముంది బండ్ల గణేష్ అప్పుడే కర్చీఫ్ వేసాడు పవన్ దగ్గర .

ఇంతకుముందు బండ్ల గణేష్ కు రెండుసార్లు ఛాన్స్ ఇచ్చాడు పవన్ , తీన్ మార్ సినిమా చేసాడు అయితే అది అట్టర్ ప్లాప్ అయ్యింది దాంతో గబ్బర్ సింగ్ అనే సినిమా చేసాడు అది బ్లాక్ బస్టర్ అయ్యింది . అప్పటి నుండి మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ చూస్తున్నాడు బండ్ల కానీ కుదరడమే లేదు . కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖాళీగా ఉన్నాడు , కానీ బండ్ల గణేష్ కు డేట్స్ ఇస్తాడా ? అన్నది ప్రశ్నగా మారింది . అయితే బండ్ల పవన్ కళ్యాణ్ కు అరివీర భయంకరమైన భక్తుడు కాబట్టి ఏమో ! గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా డేట్స్ ఇస్తాడేమో !!