సాహో లో ప్రభాస్ ఒక్కరా ? ఇద్దరా ?


Prabhas
Prabhas

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం సాహో . ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. 350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సాహో లో ప్రభాస్ ఒక్కరా ? లేక ఇద్దరా ? అనే ప్రశ ఉత్పన్నం అవుతోంది. ఎందుకంటే ప్రభాస్ రెండు రకాల గెటప్ లలో కనిపిస్తున్నాడు. ఇద్దరి హెయిర్ స్టైల్ వేరుగా కనిపిస్తోంది. దాంతో ఈ డౌట్ వస్తోంది. ఒకరు దొంగ గా మరొకరు పోలీసు అధికారిగా రెండు పాత్రల్లో ప్రభాస్ నటిస్తున్నాడు అని తెలుస్తోంది అయితే ఇది నిజమా ? కాదా ? అన్నది మాత్రం ఆగస్టు 30 న తేలనుంది.

భారీ యాక్షన్స్ సీన్స్ కలిగిన సాహో చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న అతృతతో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ . ఇక ప్రేక్షకులకు కూడా ఈ ఉత్సుకత ఉంది. మరో పది రోజుల్లో సాహో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. దాంతో నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. ఇక రావాల్సింది ఈ సినిమాని కొనుక్కున్న బయ్యర్లకు మాత్రమే . అది వస్తుందా ? లేదా ? అన్నది కూడా ఆగస్టు 30 నే తేలనుంది.