రకుల్ ప్రీత్ సింగ్ ఫ్రస్టేషన్ లో ఉందా ?


Rakul Preet Singh
Rakul Preet Singh

రకుల్ ప్రీత్ సింగ్ ఫ్రస్టేషన్ లో ఉన్నట్లుంది అందుకే మీడియా సమావేశంలో ప్రశ్నకు ప్రశ్న వేసి తన కోపాన్ని ప్రదర్శించింది . నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన మన్మథుడు 2 చిత్రం ఈనెల 9 న విడుదలకు సిద్దమైన నేపథ్యంలో రకుల్ మీడియా ముందుకు వచ్చింది. ఈ భామ కాస్త కోపంగా ఉంది అందుకే అన్ని ప్రశ్నలకు కూడా వెటకారంగా సమాధానం ఇవ్వడమే కాకుండా కొన్ని ప్రశ్నలకు తిరిగి ప్రశ్నలే వేసింది .

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు దశాబ్దం కావస్తోంది , కానీ ఆరేళ్లుగా మాత్రమే ప్రేక్షకులకు తెలుసు . ఇక ఇటీవల ఈ భామ కు తెలుగులో పెద్దగా సినిమాలు లేకుండాపోయాయి , దానికి తోడు హిందీలో నటించిన సినిమా సూపర్ హిట్ కావడంతో కాబోలు ఇలా వ్యవహరించి ఉంటుందని అనుకుంటున్నారు పలువురు .