హోం మినిష్టర్ గా రోజా ?


ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ తో పాటుగా పార్లమెంట్ కు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే . అయితే జరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి అధికారంలోకి వచ్చేది మేమే అంటే మేమే అంటూ అధికార , ప్రతిపక్ష పార్టీలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు . ఇక జగన్ అయితే ముఖ్యమంత్రి అయిపోయినట్లు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో .

ఇక అప్పుడే మంత్రివర్గం ఎలా ఉండబోతోంది అన్న చర్చ కూడా సాగుతోంది . సినీ నటి రోజా అయితే హోం మినిష్టర్ అవ్వడం ఖాయమని , ఆమెకు బెర్ట్ ఖాయమైపోయిందని ప్రచారం చేస్తున్నారు . తెలుగుదేశం పార్టీని వీడి పదేళ్లుగా జగన్ పార్టీలో కొనసాగుతోంది రోజా . ఫైర్ బ్రాండ్ గా పేరు గాంచిన రోజా హోం మినిష్టర్ అయితే ఇంకా ఏమైనా ఉందా ? కొంతమంది చుక్కలు అంటే ఏంటో చూపించడం ఖాయం . వై ఎస్ రాజశేఖర్ కూడా కూడా తన క్యాబినెట్ లో చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రా రెడ్డి ని హోం మినిష్టర్ గా నియమించిన విషయం తెలిసిందే . అయితే జగన్ ముఖ్యమంత్రి అయితేనే రోజా హోం మినిష్టర్ అయ్యేది ! ఎన్నికల ఫలితాలు మే 23 న రానున్నాయి . అప్పుడే తేలిపోనుంది జగన్ , రోజా ల భవితవ్యం .