ఆర్ ఆర్ ఆర్ కు ఎదురెళ్లే ధైర్యం ఎవరైనా చేస్తారా అసలు?


ఆర్ ఆర్ ఆర్ కు ఎదురెళ్లే ధైర్యం ఎవరైనా చేస్తారా అసలు?
ఆర్ ఆర్ ఆర్ కు ఎదురెళ్లే ధైర్యం ఎవరైనా చేస్తారా అసలు?

ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు ఇండియా వైజ్ గా చూసుకున్నా టాప్ డైరెక్టర్స్ లో ముందు వరసలో ఉంటాడు. హీరోలను మించిన బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు రాజమౌళి సొంతం. అలాంటిది ఈ దర్శకుడు ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి సినిమా తీస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా పీరియాడిక్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి మొదలైంది. అజయ్ దేవగన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మొదటగా ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేద్దామని భావించారు. అయితే షూటింగ్ లో జాప్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకా ఎక్కువ సమయం పట్టనుండడంతో దసరా సీజన్ కు చిత్ర విడుదల ఉంటుందని ఈ మధ్య ప్రచారం జరిగింది.

అయితే దసరా సీజన్ కూడా మిస్ అయితే ఇక వచ్చే సంక్రాంతికే చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నట్లు మరో ప్రచారం ఊపందుకుంది. సంక్రాంతి సీజన్ కు ఉన్న అడ్వాంటేజ్ ఎలాంటిదో ఈసారి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలతో మరోసారి నిరూపితమైంది. మాములుగా విడుదలైతే ఈ రెండు చిత్రాల పరిస్థితి ఎలా ఉండేదో కానీ సంక్రాంతి సీజన్ లో విడుదలవ్వడం వల్ల చాలానే లాభపడ్డాయి.

అందుకే ఆర్ ఆర్ ఆర్ ను 2021 సంక్రాంతికి విడుదల చేస్తే చాలా బాగుంటుందనేది కొందరి అభిప్రాయం. అయితే వచ్చే సంక్రాంతి ప్రభాస్ 20వ సినిమా, మహేష్ 27వ సినిమా, అల్లు అర్జున్ – సుకుమార్ సినిమా టార్గెట్ చేస్తున్నాయి. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ కూడా సంక్రాంతి సీజన్ కు వస్తే వీటిలో ఏ చిత్రం ఆర్ ఆర్ ఆర్ తో పోటీ పడి నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆర్ ఆర్ ఆర్ వైపు నుండి చూస్తే వాళ్ళు పెట్టిన బడ్జెట్ కు సోలో రిలీజ్ అనేది కచ్చితం. ఒకవేళ సంక్రాంతికి వస్తే మాత్రం సోలో రిలీజ్ దక్కడం అనుమానమే. మరి జక్కన్న అండ్ కో ఏం చేస్తారో చూడాలి.