సమంత ప్రెగ్నెన్సీ తో ఉందా ?


Is Samantha pregnant ?
Samantha

సమంత పెట్టిన పోస్ట్ తో కలకలం చెలరేగుతోంది . ఎందుకంటే ఆ భామ పెట్టిన పోస్ట్ తో సమంత ప్రెగ్నెన్సీ తో ఉన్నట్లుగా అనుమానం వస్తోంది అయితే గర్భంతో ఉందా ? లేక తల్లి కావడానికి డిసైడ్ అయ్యిందా ? అన్నది తేలాలి . 2017 లో సమంత – నాగచైతన్య లు పెళ్లి చేసుకున్నారు . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పిల్లలను మాత్రం ఎప్పుడు కనాలో అపుడు మాత్రమే కంటామని తేల్చి చెప్పింది గత ఏడాది ఏప్రిల్ లో .

కట్ చేస్తే …… న్యూ ఇయర్ వేడుకల కోసం విదేశాలకు వెళ్ళింది ఈ జంట . న్యూ ఇయర్ వేడుకలను బాగా జరుపుకున్నప్పటికీ ఇంకా ఆమ్ స్టర్ డాం లోనే ఉన్నారు సమంత – నాగచైతన్య . అయితే లాస్ట్ లైట్ అంటూ ఓ పోస్ట్ పెట్టి మామిడికాయ నేనెందుకు తినొద్దు అంటూ ప్రశ్నిస్తోంది . గర్భం దాల్చిన వాళ్ళు మాత్రమే పుల్లటి పదార్థాలను తీసుకుంటారు . చింతకాయ , మామిడికాయ లను తింటారు . దాంతో సమంత గర్భవతి అని అనుమానం వ్యక్తం అవుతోంది . సమంత గర్భం దాల్చి ఉండాలి లేదంటే పిల్లలను కనడానికి డిసైడ్ అయినా అయి ఉండాలి అని వినబడుతోంది . చూద్దాం సమంత ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో .

English Title: Is Samantha pregnant ?