త్వరలో నాగ చైతన్య – సమంత నుండి గుడ్ న్యూస్ ..?


Is Samatha carrying pregnancy
Is Samatha carrying pregnancy

సమంత తల్లి కాబోతుందా.?

అందుకే ఏ కొత్త సినిమాలను అంగీకరించడం లేదా.?

ప్రస్తుతానికి సమంత తమిళ సినిమా 96 రీమేక్ లో శర్వానంద్ కలిసి నటిస్తోంది.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి  96 సినిమాని తమిళంలో చేసిన దర్శకుడే తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు.  ఇది కాకుండా సమంత ఇప్పుడు కొత్తగా ఏ సినిమాలను ఒప్పుకోలేదు.

కొత్త కథలు కూడా వినడం లేదని సమాచారం. అమెజాన్ కు సంబంధించి ఫ్యామిలీ మన్ 2 వెబ్ సిరీస్  మాత్రమే సమంత ఇప్పుడు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించే  సమంత ప్రస్తుతం తల్లి కావాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.  అందుకు తగ్గట్టే డాక్టర్ల పర్యవేక్షణలో ఆహార నియమాలను ఆమె పాటిస్తున్నారు.

అంతకుముందు నాగచైతన్యతో కలిసి ఆమె నటించిన మజిలీ చిత్రం సమయంలో ఆమె తల్లి కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి.  అక్కినేని కుటుంబం అభిమానులు తో సహా యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఆ వార్త కోసం ఎదురు చూశారు.  కానీ అది నిజం కాలేదు. రాబోయే 2020 సంవత్సరం లో అయినా సమంత అక్కినేని కుటుంబానికి నాలుగో తరం వారసుని అందిస్తుందని ఆశిద్దాం.