ఆ భారీ సినిమా ఆగిపోయిందా


Is samghamitra movie shelved300 కోట్ల భారీ బడ్జెట్ అంటూ సంఘ మిత్ర చిత్రాన్ని కేన్స్ ఉత్సవాల్లో ప్రకటించారు కట్ చేస్తే హీరోయిన్ శృతి హాసన్ ఆ సినిమా నుండి తప్పుకుంది . ఇక ఎంతోమంది హీరోయిన్ లను వెతికి వెతికి చివరకు బాలీవుడ్ భామ దిశా పటాని ని సంఘ మిత్ర గా ఎంపిక చేసారు . ఇక ప్రారంభమే అని ప్రకటించారు కట్ చేస్తే ఇప్పుడా భారీ బడ్జెట్ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది . ఈ విషయాన్నీ స్వయంగా హీరోయిన్ దిశా పటాని చెప్పడం విశేషం . ఓ దక్షిణాది భారీ బడ్జెట్ సినిమా ప్రారంభం అవుతుందని ఆశించాను కానీ ఇప్పుడా సినిమా సెట్స్ మీదకు వెళ్లేలాగే కనిపించడం లేదు అంటూ అసలు విషయాన్నీ చెప్పేసింది .

దిశా పటాని దక్షిణాదిన చేస్తా అని ఒప్పుకున్న సినిమా సంఘ మిత్ర మాత్రమే ! ఇంతకుముందు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నటించింది , అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో మళ్ళీ ఈ భామకు తెలుగులో ఛాన్స్ లు రాలేదు . బాలీవుడ్ లో మాత్రం పలు చిత్రాల్లో నటిస్తోంది . సుందర్ సి దర్శకత్వంలో సంఘ మిత్ర చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తేనాండాళ్ ఫిలిమ్స్ నిర్మించాలని ప్లాన్ చేసింది కానీ ఎక్కడో తేడా కొట్టింది అందుకే ఆ సినిమా అస్సలు పట్టాలెక్కడం లేదు .

English Title: is samghamitra movie shelved