శ్రీ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతుందా


is sri reddy joining telugudesamవివాదాస్పద నటి శ్రీ రెడ్డి తెలుగుదేశం పార్టీ లో చేరుతుందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది ఎందుకంటే గతకొంత కాలంగా తెలుగుదేశం పార్టీ కి అనుకూలంగా పవన్ కళ్యాణ్ , చిరంజీవి లతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అలాగే కేటీఆర్ పై కూడా విమర్శలు చేస్తోంది . అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నా అభిమాన నాయకుడు , సినిమా హీరోలకంటే రియల్ హీరో అయిన చంద్రబాబు అంటేనే ఇష్టం అంటూ కామెంట్ చేయడంతో శ్రీ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతుంది అనడానికి సంకేతం లా ఉంది .

అలాగే పనిలో పనిగా బాలయ్య బాబు , జూనియర్ ఎన్టీఆర్ లను పొగుడుతోంది శ్రీ రెడ్డి . బాలయ్య పుట్టినరోజు సందర్బంగా బాలయ్య బాబు కి జన్మదిన శుభాకాంక్షలు అందజేయడమే కాకుండా సోషల్ మీడియాలో బాలయ్యని టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని తూర్పారబట్టింది .ఇక నాని పై ఉన్న కోపంతో బిగ్ బాస్ షో ఎన్టీఆర్ వల్లే హిట్ అయ్యింది అయితే బిగ్ బాస్ 2 మాత్రం ఎన్టీఆర్ స్థాయిలో అలరించలేకపోతున్నాడు అంటూ నాని పై విమర్శలు చేస్తోంది . మొత్తానికి మెగా హీరోలకు , తెలంగాణ ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న శ్రీ రెడ్డి తెలుగుదేశం పార్టీ కి బాలయ్య , ఎన్టీఆర్ లకు అనుకూలంగా వ్యాఖ్యానిస్తూ రాజకీయ వర్గాల్లో కూడా దుమారం రేపుతోంది .