ఏంటి సైరా వాయిదా పడుతోందా??


Syeraa Narasimha Reddy
ఏంటి సైరా వాయిదా పడుతోందా??

ఇప్పటిదాకా ఎవరూ ఊహించని వార్త ఇది. ఎన్ని వాయిదా పుకార్లు వచ్చినా ఖండిస్తూ వచ్చిన సైరా టీం ఇప్పుడు సినిమా వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనికి బలమైన కారణాలు లేకపోలేదు. సినిమా విడుదలకు ఇంకా నాలుగు వారాలు కూడా లేదు, అయినా ఇంకా గ్రాఫిక్స్ పనులు కొలిక్కి రాలేదు. చిరు అండ్ కో బెటర్మెంట్ కోసం ట్ర్య్ చేస్తున్నారు. రెండోది హృతిక్ రోషన్ వార్ తో డైరెక్ట్ క్లాష్ ఎందుకనే భావన సైరా క్యాంప్ లో వ్యక్తమవుతోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 15న కర్నూల్ లో ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే దానికి చాలా తక్కువ సమయమే ఉంది. ఇంకా పెర్మిషన్స్ రావాల్సి ఉంది. ఒకవేళ పెర్మిషన్స్ రాకపోతే ఈవెంట్ వెన్యూ మార్చాల్సి ఉంటుంది. మొత్తానికి సైరా టీం ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది.