కేసీఆర్ మూడో కన్ను ఇదేనా?


Is this kcr's third eye

బిడ్డా ! చంద్రబాబు నేను మూడో కన్ను తెరిస్తే ఎట్లా ఉంటదో చూపించనా ? మూడో కన్ను తెరవనా ? అంటూ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై కేసీఆర్ నిప్పులు కక్కిన విషయం తెలిసిందే. తెలంగాణతో పెట్టుకుంటే ఎట్ల ఉంటదో ఒకసారి దెబ్బ చూపించిన ఆ దెబ్బతో విజయవాడ కరకట్ట మీద పడ్డవ్ బిడ్డా ….. చీ నీతో పొత్తా ? అంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మరో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శించడంతో పెద్ద ఎత్తున కేసీఆర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే కేసీఆర్ మూడో కన్ను ఇదే అంటూ మద్యం బాటిల్ ని చూసిస్తూ షేర్ ల మీద షేర్ లు చేస్తున్నారు.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చేరుగుతున్నారు పలువురు నెటిజన్లు. చంద్రబాబు పై విమర్శలు చేస్తే తప్పులేదు కానీ మరీ శృతిమించిన విమర్శల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు ఎక్కువ కాలం ముఖ్యమంత్రి గా సేవలందించిన వ్యక్తి , ఇప్పుడేమో రాష్ట్రం విడిపోయాక సాటి ముఖ్యమంత్రి గా గౌరవించాల్సింది పోయి చవకబారు విమర్శలు చేయడం తగదు అంటూ కేసీఆర్ ని తప్పుపడుతున్నారు. తెలంగాణ లో ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటోంది దాంతో కేసీఆర్ ఆ కూటమి ని తూర్పారబడుతూ చంద్రబాబు ని ఘోరంగా అవమానించాడు. ఇంకేముంది కేసీఆర్ మూడో కన్ను ఇదే అంటూ మద్యం బాటిల్ ని పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

English Title: Is this kcr’s third eye